Header Ads

విరాట్ కోహ్లి సెంచరీ.. శ్రీలంకపై భారత్ ఘన విజయం

 

Ind Vs SL 1st ODI : గువాహటి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 12 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. అతడి ఒంటరి పోరాటం వృథా అయ్యింది. లంకకు ఓటమి తప్పలేదు.

లంక బ్యాటర్లలో నిస్సాంక (72), డిసిల్వ(47) రన్స్ చేశారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. షమీ, పాండ్యా, చహల్ తలో వికెట్ తీశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (83), ఓపెనర్ శుభ్ మన్ గిల్(70) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. విరాట్ 87 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. వీరు ధాటిగా ఆడటంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది.

No comments

Powered by Blogger.